telugu navyamedia
రాజకీయ

ముంబైలో వారు లేకపోతే… డబ్బే ఉండదు ..మహారాష్ట్ర గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు….

మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను తీసేస్తే రాష్ట్రానికి రెవెన్యూనే ఉండదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మరీ ముఖ్యంగా ముంబయి, ఠాణెను విడిచివెళ్లిపోతే.. ఈ రాష్ట్రంలో డబ్బే ఉండదని.. అప్పుడు ముంబయి దేశ వాణిజ్య రాజధానిగా ఉండే అర్హత కోల్పోతుందని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై.శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గవర్నర్‌పై ఆగ్రహించారు. “మరాఠీలను అవమానించారు” అంటూ ట్విటర్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీజేపీ మద్దతు పొందిన ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే, మరాఠీ వ్యక్తి కి అవమానంజరిగిందని అన్నారు

ఆయన చేసిన కామెంట్స్‌ను వెంటనే ముఖ్యమంత్రిముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ఈ వ్యాఖ్యలనుఖండించాలని డిమాండ్ చేశారు. మరాఠీల గౌరవానికి భంగం కలిగించారు” అని ట్విటర్‌లో గవర్నర్‌ ప్రసంగానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేశ్, సచిన్ సావంత్ కూడా ఈ వివాదంపై స్పందించారు. గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది అని అన్నారు.

Related posts