telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేసీఆర్‌పై ధ‌ర్మ యుద్ధం చేస్తున్నా..మునుగోడులో ఉప ఎన్నిక ఖాయం..

*మునుగోడులో ఉప ఎన్నిక ఖాయం..
*15 రోజుల్లో నిర్ణ‌యం ఉంటుంద‌న్న రాజ‌గోపాల్‌రెడ్డి
*మునుగోడులో ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పు.. తెలంగాణ‌లో మార్పుకు నాంది ప‌ల‌కాలి..
*మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తో కాంగ్రెస్ నేతల చర్చలు విఫలం

*కేసీఆర్‌పై ధ‌ర్మ యుద్ధం చేస్తున్నా

మునుగోడులో ఉపఎన్నిక ఖాయమని… కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తానని రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారనే సంకేతాల నేపథ్యంలో.. ఆయనను బుజ్జగింపుల పర్వం నేప‌థ్యంలో శనివారం ఉదయం ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ రెడ్డిలు.. రాజగోపాల్‌ రెడ్డితో వేర్వురుగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటగా ఢిల్లీ రావాలని కాంగ్రెస్ నేతలు కోరారు. అయితే ఆ చర్చలు కూడా విఫలమైనట్టుగానే సమాచారం.

అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ధర్మ యుద్దం చేస్తానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజలు భావిస్తే ఉప ఎన్నిక ఖాయమని చెప్పారు.

మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణవ్యాప్తంగా చర్చ జరగాలి. ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పు.. తెలంగాణలో మార్పునకు నాంది కావాల‌ని అన్నారు. ఆ ఉప ఎన్నికతో తెలంగాణలో తప్పక మార్పు వస్తుంది. నేను కేసీఆర్‌పై ధర్మ యుద్ధం చేస్తున్నా అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు ఆదివారం నుంచి ఆయన తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నిజయోకవర్గంలో పర్యటించిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై ఆయన ఒక ప్రకటన చేస్తారని తెలుస్తోంది

Related posts