telugu navyamedia
తెలంగాణ వార్తలు

బాస‌ర ట్రిపుల్ ఐటీ ఆగ‌ని ఆందోన‌లు..

*బాస‌ర ట్రిపుల్ ఐటీ ఆగ‌ని ఆందోన‌లు..
*జోరువాన‌లో రోడ్డుపై బైఠాయించిన స్టూడెంట్స్‌..
*ఆరోరోజు పెద్ద‌సంఖ్య‌లో రొడ్డెక్కి ఆందోన‌లు..

బాస‌రలోని ట్రిపుల్ ఐటీ లో విద్యార్ధులు ఆందోన‌లు కొన‌సాగుతున్నాయి..ఈ నెల 18న విద్యార్ధులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌గా, చ‌ర్చ‌లు విఫ‌లం అంటూ విద్యార్ధులు ట్వీట్ చేయ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది.

ఈ క్ర‌మంలోనే ఆదివారం ఉదయం నుండి విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు.తాము లేవనెత్తిన 12 డిమాండ్లల‌లో ఏ ఒక్క డిమాండ్‌పై స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌లేద‌ని, హామీ ప‌త్రం విడుద‌ల చేసిన మ‌రుక్ష‌ణ‌మే ఆందోళ‌న విర‌మిస్తామ‌ని విద్యార్ధులు స్పష్టం చేస్తున్నారు.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఆందోళన ఆరు రోజుకు చేరుకుంది. ఈ నెల 16న బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా ప్రోఫెసర్ సతీష్ కుమార్ ను నియమించింది ప్రభుత్వం. విద్యార్ధులకు మద్దతుగా పేరేంట్స్ కూడా బాసర ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద నిరసనకు దిగారు. ఆందోళన చేసిన పేరేంట్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే తమ డిమాండ్లపై ప్రభుత్వం చులకనగా మాట్లాడడాన్ని విద్యార్ధులు తప్పు పట్టారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమ డిమాండ్లను సిల్లీ డిమాండ్లు పేర్కొన్నారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

మరో వైపు ఈ వ్యాఖ్యలపై విద్యార్ధుల పేరేంట్స్ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు వచ్చి చూస్తే తమ డిమాండ్లు న్యాయబద్దమైనవో కావో తెలుస్తుందన్నారు. చర్చలకు పిలిచి జిల్లా అధికారులు తమతో వ్యవహరించిన తీరు సరిగా లేదని విద్యార్ధులు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై విద్యార్ధుల పేరేంట్స్ ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద నిరసనుకు దిగారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

విద్యార్ధులు ఆందోళనను విరమించాలని ప్రభుత్వం కోరుతుంది. తాము లేవనెత్తిన 12 డిమాండ్లను పరిష్కరిస్తేనే తాము ఆందోళనను విరమిస్తామని కూడా విద్యార్ధులు తేల్చి చెప్పారు.

Related posts