telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎంతో శ్రమించాయి: కేటీఆర్ ట్వీట్

ktr trs president

ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎంతో శ్రమించాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇటీవలే మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లోఫాస్ట్ ట్రాక్ కోర్టులు పేరుకు తగ్గట్టే సత్వర న్యాయం అందేలా చేశాయని మంత్రి కేటీఆర్ అభినందించారు.

కేవలం 6 నెలల వ్యవధిలో తెలంగాణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 3 తీవ్రమైన నేరాల్లో తీర్పులు వెలువరించాయని తెలిపారు. ఈ కేసుల్లో ఐదుగురు నిందితులకూ ఉరిశిక్ష పడిందని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థకు, హోం డిపార్ట్ మెంట్ అధికారులకు శుభాభినందనలు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Related posts