telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

7 నెలల్లో రూ. 35 వేల కోట్ల అప్పులు చేశారు: తులసిరెడ్డి

Tulasireddy

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రూ. 35 వేల కోట్ల అప్పులు చేశారని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని వైసీపీది రౌడీ పాలనని మండిపడ్డారు. పిచ్చోడి చేతికి ఏకే47 తుపాకీ ఇచ్చినట్టు పాలన ఉందని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం సంపాదించిన అస్తులను అమ్ముతూ పాలిస్తున్నారని దుయ్యబట్టారు.మూడు రాజధానులు అనేది ఒక అవివేకమైన నిర్ణయమని అన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కోడికత్తి కేసు కానీ, వైయస్ వివేకా హత్య కేసు కానీ తేలలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యాచరణను రూపొందిస్తున్నామని చెప్పారు. పార్టీకి మళ్లీ పునర్వైభవాన్ని తీసుకొస్తామని అన్నారు.

Related posts