telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కోవిడ్ నివార‌ణలో ప్ర‌భుత్వం విఫ‌లం అయ్యింది : ఆల‌పాటి

Alapati Rajendera prasad tdp

రాష్ట్రంలో కోవిడ్ నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం అయింద‌ని ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ అన్నారు. 45 ఏళ్లు దాటిన వారిలో కేవ‌లం 28శాతం మందికి మాత్ర‌మే వ్యాక్సినేష‌న్ పూర్తి చేశార‌ని, ఇంకా 72 శాతం వ్యాక్సినేష‌న్ పూర్తికావాల్సి ఉంద‌ని అన్నారు.  రాష్ట్రంలో క‌రోనా సెకండ్ వేవ్ అధికంగా ఉంద‌ని, మ‌ర‌ణాల రేటు అధికంగా ఉంద‌ని అన్నారు.  రాష్ట్రంలో ఆక్సిజ‌న్, బెడ్లు కూడా దొర‌క‌డంలేద‌ని అన్నారు.  ప్ర‌భుత్వం చెప్తున్న లెక్క‌ల‌కు, వాస్త‌వ ప‌రిస్థితికి చాలా వ్య‌త్యాసం ఉంద‌ని విమ‌ర్శించారు.  క‌రోనా మందుల‌ను సామాన్యుల‌కు అందుబాటులో లేకుండా పోయాయని దుయ్య‌బ‌ట్టారు.  అక్టోబ‌ర్‌లోనే సెకండ్‌వేవ్ ప్రారంభ‌మైనా ప్ర‌భుత్వం ఎలాంటి చర్య‌లు తీసుకోలేద‌ని, రాష్ట్రంలో డ‌బ్బులు పెట్టినా బెడ్లు దొర‌క‌ని ప‌రిస్థితి అని అన్నారు.  క‌రోనా నివార‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన మూడువేల కోట్ల నిధులు ఏం చేశారో చెప్పాల‌ని నిల‌దీశారు.  క‌రోనా వైఫ‌ల్యంపై మాట్లాడితే త‌ప్పుడు కేసులు పెడుతున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Related posts