telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బెడ్ల విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కేసీఆర్

KCR cm telangana

రాష్ట్రంలో కరోనావిజృంభిస్తున్న నేపథ్యంలో ప్రగతిభవన్‌లో వైద్యశాఖ అధికారులతోతెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బెడ్ల విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనాతో ప్రజలు హైరానా పడి ప్రైవేట్‌ ఆస్పత్రులకు పోవద్దని అన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి నెలకొందని, వైరస్‌ విషయంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో అంత భయంకరమైన పరిస్థితి లేదని తెలిపారు. అయినపట్టికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related posts