telugu navyamedia
తెలంగాణ వార్తలు

టీఆర్ ఎస్‌ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది- తరుణ్​చుగ్

టీఆర్ ఎస్‌ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ స్పష్టం చేశారు. గడిచిన ఎనిమిదేళ్లలో ప్రధాన మంత్రి మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై చర్చకు బీజేపీ సిద్దంగా వుందని తెలంగాణ బిజెపి ఇన్ చార్జి తరుణ్ చుగ్ పేర్కొన్నారు.

జులై 3న సాయంత్రం పరేడ్ గ్రౌండ్​లో భారీ సభ నిర్వహిస్తున్నామ‌ని అన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని అన్నారు. 

తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని.. కేసీఆర్, ఆయన కుటుంబం మొత్తం పెత్తనం చేస్తున్నారని తరుణ్​చుగ్ ఆరోపించారు. కేసీఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా అలీబాబా 40 దొంగల తీరుగా మారి.. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.

టీఆర్ ఎస్‌ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న తరుణ్​చుగ్​.. కేసీఆర్ పాలనపై “సాలు దొర.. సెలవు దొర” వెబ్​సైట్​ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇంకా 529 రోజులు మాత్రమే సీఎం కేసీఆర్​కు సమయం ఉందని.. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందని తరుణ్​చుగ్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో అన్ని వర్గాలను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని , ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. దళిత బంధు ఏమైంది, 2 పడక గదుల ఇళ్లు ఏమయ్యాయి.

రాష్ట్రంలో జంతర్ మంతర్ తాంత్రిక్ సర్కార్ నడుస్తోందని తరుణ్‌చుగ్ ఎద్దేవా చేశారు.కేసీఆర్‌ సర్కార్‌కు ప్రజలు గుడ్‌బై చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన అన్నారు. 

Related posts