telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కిషన్ రెడ్డి సహాయ మంత్రా? నిస్సహాయత మంత్రా ?

ktr telangana

వరద బాధితుల విరాళాలపై పెద్ద స్కాం జరిగిందని, సొంత కార్యకర్తలకే డబ్బులు ఇచ్చారని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే..దీనిపై మంత్రి కేటీఆర్‌ విపక్షాలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ఇవాళ ఆయన దీనిపై మీడియాతో మాట్లాడారు. నాలుగు లక్షల వరద బాధితుల కు నష్ట పరిహారం ఇచ్చామని..ఎవరికి సాయం చేశామనే పూర్తి వివరాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. ఎలాంటి భేదాలు లేకుండా అందరికీ ఇచ్చామని.. బాధితులకు వెంటనే ఇవ్వాలని చేస్తే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వరద సాయం చేస్తుంటే కాంగ్రెస్, బీజేపీ బురద రాజకీయం చేస్తున్నాయని… దుబ్బాక లో ఓట్ల కోసం ప్రయత్నం చేశాయని నిప్పులు చేరిగారు.గుజరాత్, కర్ణాటకకు సాయం చేశారు…కానీ తెలంగాణకు చేయలేదని పేర్కొన్నారు. వరద నష్టంపై
ప్రధానికి లేఖ రాస్తే స్పందన లేదని..తెలంగాణ కు ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. అస్సులు కేంద్రం దృష్టిలో తెలంగాణ దేశంలో లేదా ? అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్రంలో నలుగురు ఎంపీలు ఉన్నారని.. ఎందుకు అడగరని నిలదీశారు.దిగజారుడు రాజకీయాలు బీజేపీ చేస్తోందని…మరో వంద కోట్లు ఇవ్వాలని సిఎం ని అడుగుతామని తెలిపారు.ధర్నాలు చేయొద్దు అర్హులు ఉంటే ఇంటికే వచ్చి సాయం చేస్తామని…చెరువులు, నాళాల కబ్జాలు దశాబ్దాలుగా జరిగాయని పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారం కూడా చూపిస్తామని హామీ ఇచ్చారు. కిషన్ రెడ్డి సహాయ మంత్రా? నిస్సహాయత మంత్రా చెప్పాలి? అని…పంట నష్టం పై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు మంత్రి కేటీఆర్‌.

Related posts