telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అగ్రరాజ్యం అధినేత బైడెన్ తొలి ప్రసంగం ఇదే…

Biden USA

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించాడు జో బైడెన్… 77 ఏళ్ల వయస్సులో ఆయన అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నాడు… అమెరికా 46వ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్నారు.. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవసభలో కీలక విషయాలను ప్రస్తావించారు బైడెన్… నా గెలుపు అమెరికన్ల విజయంగా అభివర్ణించిన ఆయన.. అమెరికన్లు భవిష్యత్తు కోసం ఓటు వేశారని ప్రకటించారు.. మనం పూర్తి ఆధిక్యంతో గెలిచాం.. అమెరికా చరిత్రలో ఇదో రికార్డుగా పేర్కొన్నారు జో బైడెన్… ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఓటేశారని.. వారి విశ్వాసాన్ని నిలబెడుతూ, దేశ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు జో బైడెన్‌.. అధ్యక్ష ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్‌ అద్భుతమైన నాయకురాలని కొనియాడిన ఆయన.. తమ గెలుపు అమెరికన్ల విజయంగా అభివర్ణించారు.

డెలావెర్‌లో ఏర్పాటు చేసిన డెమొక్రాట్ల విజయోత్సవసభలో ఉద్వేగంగా ప్రసంగించారు బైడెన్.. అధ్యక్ష స్థానం వరకు చేరుకున్న తన జీవితంలో సహకరించిన జీవిత భాగస్వామి జిల్‌ బైడెన్‌ సహా ఇతర కుటుంబ సభ్యులపై ఈ సందర్భంగా బైడెన్‌ ప్రశంసలు కురిపించారు. ఇక, ఈ ఎన్నికల్లో ఓడిపోయినా డొనాల్డ్‌ ట్రంప్‌ తనకు శత్రువేమీ కాదన్నారు బైడెన్.. అమెరికా అభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అమెరికాలోని ప్రతి కుటుంబం ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు.. దేశంలోని అన్ని వర్గాల ప్రయోజనాల కోసం కృషి చేస్తామన్నారు. నాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. ప్రజలు ఆశించిన పాలన అందిస్తానన్నారు.. కరోనావైరస్‌ పరిస్థితుల్లో ముందుకొచ్చి గెలిపించినవారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు జోబైడెన్.

Related posts