telugu navyamedia
వార్తలు సామాజిక

మీ స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్స్ ఉంటే డిలీట్ చేయండి: గూగుల్ ప్లే స్టోర్

apps play store

జోకర్ మాల్ వేర్ పట్టుకున్న ప్రమాదకరమైన 11 యాప్స్ ను తాము ప్లే స్టోర్ నుంచి తొలగించామని గూగుల్ వెల్లడించింది. ఎవరి స్మార్ట్ ఫోన్లలో అయినా ఈ యాప్స్ ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేయాలని గూగుల్ కోరింది. గత సంవత్సరం చివర్లో జోకర్ వైరస్ ను గుర్తించామని తెలిపింది. ఇది ఇప్పుడు శరవేగంగా విస్తరిస్తోందని పేర్కొంది. ఇది యాప్స్ లో దాగుండి, స్మార్ట్ ఫోన్లలోకి ఇతర వైరస్ లను ఎవరి ప్రమేయం లేకుండానే డౌన్ లోడ్ చేస్తోందని తెలిపింది. దీని కారణంగా ఎన్నో ప్రీమియం యాప్స్ ప్రమాదంలో పడ్డాయని గూగుల్ తెలిపింది.

మొత్తం 11 యాప్ లను తాము డిలీట్ చేశామని చెబుతూ, వాటిల్లో ఇమేజ్ కంప్రెస్, రిలాక్సేషన్, యాండ్రాయిడ్ ఎస్ఎంఎస్, చెర్రీ, సెండ్ ఎస్ఎంఎస్, లవింగ్ లవ్ మెసేజ్, విత్ మీ, హెచ్ఎం వాయిస్, ఫ్రెండ్స్ ఎస్ఎంఎస్, రికవరీ ఫైల్స్, ఎల్ ప్లాకర్, రిమైండ్ మీ, మెమొరీ గేమ్ ట్రయినింగ్ తదితరాలు ఉన్నాయని వెల్లడించింది.

Related posts