telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ సినిమా వార్తలు

అతియా స్విమ్ సూట్ మిర్రర్ సెల్ఫీ పై కేఎల్ రాహుల్ కామెంట్… !

KL-Rahul

భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియా ప్రేమలో ఉన్నటుగా చాలా రోజులు వార్తలు వచ్చాయి. అయితే మొదట్లో ఈ విషయం పైన ఇద్దరు ఏ విధంగా స్పందించలేదు. ఆ తరువాత వారు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఈ విషయాన్ని ఈ ఏడాది రాహుల్ పుట్టినరోజు ఏప్రిల్ 18న అధికారికంగానే ప్రకటించేసారు ఈ జంట. రాహుల్ పుట్టిన రోజు సందర్బంగా అతియా తన ఇంస్టాగ్రామ్ లో వారి ఫోటోలు షేర్ చేస్తూ ‘రాహుల్ నా వాడు’ అని చేసిన పోస్ట్ తో వీరిద్దరి ప్రేమ గురించి ప్రపంచానికి తెలిసింది. అయితే తాజాగా అతియా తన ఇంస్టాగ్రామ్ లో ఓ మిర్రర్ సెల్ఫీని పంచుకున్నారు. అందులో అతియా స్విమ్ సూట్ వేసుకొని ఉన్నారు. ఈ పిక్ పై రాహుల్ స్పందించాడు. ఆ స్విమ్ సూట్ ఫొటోకు ‘జెఫా’ అని కామెంట్ చేసారు. అయితే ఈ పదానికి స్పానిష్ భాషలో ‘బాస్’ అని అర్ధం.

Related posts