telugu navyamedia
క్రీడలు వార్తలు

రషీద్‌ ఖాన్‌ నయా రికార్డ్…

ఆఫ్గనిస్థాన్‌ స్టార్ స్పిన్నర్, ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ అరుదైన ఘనత సాధించాడు. 21వ శతాబ్దంలో ఒకే టెస్ట్‌లో అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్‌గా రషీద్‌ ఖాన్‌ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో ముగిసిన రెండో టెస్ట్‌లో రషీద్‌ 99.2 ఓవర్లు వేసి చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 36.3 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసిన రషీద్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 62.5 ఓవర్లు బౌలింగ్‌ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. 2002లో కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్‌ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ 98 ఓవర్లు వేశాడు. ఆ రికార్డును తాజాగా రషీద్‌ ఖాన్ (99.2) బ్రేక్‌ చేశాడు. అయితే మొత్తం క్రికెట్ లో ఒక టెస్టులో అత్యధిక ఓవర్లు వేసిన ఘనత మాత్రం శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ పేరిట ఉంది. 1998లో ఓవల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో మురళీధరన్‌ 113.5 ఓవర్లు బౌల్‌ చేశాడు.

Related posts