తన పేరు, హోదాను వినియోగించుకుని గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని వ్యవహారాలు నడిపిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదుచేయడం విజయవాడ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
తన వాహనానికి ఉన్న వీఐపీ స్టిక్కర్ కు నకిలీది సృష్టించి విజయవాడ, హైదరాబాద్ లో వాడుకుంటున్నారని కేసీనేని ఆరోపించారు. ఆయన ఫిర్యాదులో ఓ వాహన నంబర్ ను పేర్కొన్నారు.
ఇదే విషయంపై కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని స్పందించారు. చిన్న చిల్లర విషయంలోకి నా కుటుంబసభ్యులను లాగడం బాధాకరమన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆ స్టిక్కర్ ఎవరిదో.. ఏంటో.. విచారణలో తేలుతుందన్నారు.
శత్రుత్వం వుంటే తనపై రాజకీయ విమర్శలు చేయొచ్చు… కానీ కుటుంబంలోని ఆడవాళ్లను బయటకు లాగడం సరికాదన్నారు. తనపై ఫిర్యాదు వ్యక్తిగత వ్యవహరమేనని… ఇందుకు రాజకీయాలు కారణం కాదని శివనాథ్ స్పష్టం చేసారు.
విజయవాడ, ఆటోనగర్‌లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం జరపాలని భావించానని, దాన్ని కూడా వివాదాల్లోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు.నాని తన సొంత అన్న… శత్రువు కాదన్నారు.
టీడీపీ లో తానొక చిన్న కార్యకర్తనని, టిడిపి అధినేత చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికే తామంతా కష్టపడుతున్నామని కేశినేని చిన్ని పేర్కొన్నారు.
ఎన్నికల్లో పోటీకి టికెట్ కూడా అడగలేదన్నారు. చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి సిద్దంగా వున్నాను… పార్టీ ఆదేశిస్తే నాని గెలుపు కోసం పని చేస్తానని శివనాథ్ అన్నారు.
ఓటమిని ఒప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదు…