కలియుగ వైకుంఠ స్వామి తిరుమల శ్రీవారి ని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన ఆఫ్‌లైన్ సర్వదర్శనం టికెట్లను పునరిద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడానికి సిద్ధమయింది.
ఈ తెల్లవారు జామున 5 గంటల నుంచి సర్వ దర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్ ద్వారా భక్తులకు జారీ చేసింది. రోజుకు పది వేల చొప్పున టికెట్ల చోప్పున తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజ స్వామి సత్రాల్లో ఉచిత దర్శనం టికెట్లను జారీ చేస్తుంది టీటీడీ.
సర్వదర్శన టోకెన్లు అందుకోవాలనే తపనలో తెల్లవారుజాము నుంచే లైన్లలో నిల్చొని ఎదురుచూస్తున్నారు. ప్రారంభంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండగా.. ప్రస్తుతం కౌంటర్ల వద్ద సాధారణ స్థితిలో కనిపిస్తున్నారు. దర్శన టోకెన్లు సులువుగానే లభిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు.