telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భయపెట్టేవాళ్ళను చూసి… భయపడే రకం నేను కాదు : పవన్ కల్యాణ్

pawan

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ప్రారంభించేసాయి. ఇవాళ్టితో నామినేషన్ల విత్‌ డ్రా ఘట్టం కూడా పూర్తయింది. ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల బరిలో 28 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే.. తాజాగా తిరుపతిలో బీజేపీ, జనసేన ప్రచారం నిర్వహించాయి. ఈ ప్రచారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీపై విరుచుకుపడ్డారు. భయపెట్టేవాళ్ళను చూసి భయపడే వాడు పవన్ కల్యాణ్ కాదని.. జనసైనికులు అంతకన్నా కాదని వెల్లడించారు. ఏపిలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని… వైసీపీ ఎమ్మెల్యేలు గుండాల్లా మాట్లాడుతూన్నారని ఫైర్‌ అయ్యారు. ఎమ్మెల్యేలా లేకా మీరు గూండాలా అంటూ మండిపడ్డారు. అవసరం అయితే తల తెగిపడాలే తప్ప…. నా అడుగు వెనక్కి పడదు….నేను వచ్చినప్పుడు మాత్రమే మీకు సమస్యలు గుర్తుకు వస్తాయా అని ప్రశ్నించారు. ఎందుకు భయపడుతారు.. ఒక్క ఎమ్మెల్యే బెదిరిస్తే…భయపడిపోతారా ? మన సమస్యలను మనమే పరిష్కారించుకోవాలని ప్రజలను కోరారు.

కోట్ల వదులుకున్నప్పుడు మిమ్మల్ని చందాలు అడుగుతానని పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయని నిలదీశారు. ఏడాదిలోపు ఏపి దశ, దిశను మనం మార్చాలని.. డబ్బుకు ఓటు కొనే పరిస్థితి పోవాలన్నారు. వైకాపా నేతలకు ఛాలెంజ్ చేస్తున్న సామాన్యలతో కాదు.. నాతో గోడవకు రండి అని సవాల్‌ విసిరారు. అంతే కానీ సామాన్య ప్రజలపై మీ ప్రతాపం ఏంటీ… వారిపై కేసులు పెట్టడం ఏంటి ? అని నిలదీశారు. మా అక్క రత్న ప్రభ తిరుపతిలో గెలవాలని కోరకుంటున్నా… అమె అనుభవంతో తిరుపతిలో అనంతమైన అభివృద్ధి జరగాలి కోరుకుంటున్నానని పేర్కొన్నారు పవన్‌. జీవితంలో ఎటువంటి కోరికలు లేకపోయినా… నాలో అనువణువునా దేశ భక్తి నిండి ఉందన్నారు. ఎన్నో త్యాగాలు చేస్తే వచ్చిన స్వాతంత్రదేశంలో…కొద్దిమంది వారి అబ్బసోత్తులగా సంపదను దోచుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. కోట్లు సంపాదిస్తాను.. కోట్లు టాక్స్ కడుతాను…ప్రజలకు ఇస్తున్నానని పవన్‌ తెలిపారు. పులివెందల అనగానే.. రౌడీయిజం గుర్తుకు వస్తోందని..అది మీవల్లేనని పేర్కొన్నారు.

Related posts