telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కవిత వల్లే మరో యూనియన్ కండువా కప్పుకోవాల్సి వచ్చింది: కెంగర్ల మల్లయ్య

kengarla-mallaiah singareni union

టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవితపై భారతీయ మజ్దూర్ సంఘ్ ( బిఎంఎస్) నాయకుడు కెంగర్ల మల్లయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు.కొత్తగూడెంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం) గౌరవాధ్యక్షురాలు కవిత వల్లే తాను మరో యూనియన్ అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ కండువా కప్పుకోవాల్సి వచ్చిందని విమర్శించారు. కవితను నమ్మి తాము ఎన్నో బాధలను అనుభవించామని చెప్పారు.

తెలంగాణ ఆవిర్భావికి ముందే తాను టీబీజీకేఎస్ ను స్థాపించానని మల్లయ్య తెలిపారు. ఆ తర్వాత తనను అడుగడుగునా అవమానాలకు గురి చేశారని, యూనియన్ ను పైరవీకారులకు అప్పగించారని చెప్పారు. చీమల పుట్టలో పాములు చేరినట్టు… టీబీజీకేఎస్ లో చొరబడ్డ కొన్ని శక్తులు యూనియన్ ను నాశనం చేశాయని మండిపడ్డారు. అప్పట్లో ఉన్న ఉద్యమ స్ఫూర్తిని కేసీఆర్ కోల్పోయారని ఆయన అన్నారు.

Related posts