హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో గురువారం జనసేన, బీఎస్పీ పార్టీల బహిరంగ సభ జరగనుండటంతో నగర పోలీసులు ట్రాఫిక్ అంక్షలు విధించారు. దీంతో ఎల్‌బీ స్టేడియం పరిసరాలలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సభను దృష్టిలో ఉంచుకుని వాహనాదారులు ప్రత్యమ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు అంబేద్కర్ విగ్రహం, లిబర్టీ, బషీర్‌బాగ్ మీదుగా ఆయ్‌కార్ భవన్ వద్దకు చేరుకుని కార్యకర్తలను దించి. వాహనాలను నెక్లెస్ రోడ్డు లేదా ఎన్జీఆర్ స్టేడియంలో పార్క్ చేసుకోవాలి. ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మెహదీపట్నం, పాత నగరం నుంచి వచ్చే వాహనాలు పబ్లిక్ గార్డెన్‌లో వాహనాలను నిలపాలి. ముషీరాబాద్, అంబర్‌పేట్, హిమాయత్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదురుగా ఉన్న నిజాం కాలేజీ గేటులో వాహనాలను పార్క్ చేయాలి. వీఐపీ వాహనాలను వ్యవసాయ శాఖ కార్యాలయం, ఎస్‌సీఈఆర్‌టీ, మహబూబియా కాలేజీలో వాహనాలను పార్క్ చేసుకోవాలి. మీడియా ప్రతినిధులు డి గేటు వద్ద దిగి అలియా కాలేజీ వద్ద పార్క్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
సమాజంలో మహిళల పట్ల చులకనభావం పోవాలి: కోదండరాం