ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ వేసిన సమయంలో వినియోగించిన ఆటోకు ప్రకాశ్ రాజ్ అనుమతి తీసుకోలేదంటూ బెంగళూరులోని అశోక్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్ మార్చి 22న ఆటోలో వెళ్లి తన నామినేషన్‌ను వేశారు. అనుమతి లేకుండా ఆటోలో రావడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందంటూ రిటర్నింగ్ అధికారి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
చంద్రబాబు ట్రంప్ తోనైనా పొత్తు పెట్టుకోగలరు: మంత్రి అనిల్