telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో కరోనా కల్లోలం : జగన్ సర్కార్ పై హై కోర్టు సీరియస్

ap high court

ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 11 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో  ఏపీలో కోవిడ్ పరిస్థితులు, ప్రభుత్వ చర్యలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్బంగా ఏపీలో కోవిడ్ పరిస్థితులపై ఎమికస్ క్యూరీ ఏర్పాటుకు అదేశాలు ఇచ్చింది హైకోర్టు. గంటన్నర పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆక్సిజన్, బెడ్లు, టెస్టులు, రిపోర్టులు, డ్రగ్స్, వ్యాక్సినేషన్ పై సమగ్ర వివరాలతో అఫిడవిట్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ నిల్వలు ఎలా ఉన్నాయి, ఎంత మేరకు సరిపోతాయి, ఏయే పాయింట్స్ నుంచి ఎంత ఉత్పత్తి చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు..ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులకు సరిపడా బెడ్లు, సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు చేశారని ప్రశ్నించింది. చనిపోయిన రోగుల దహనం విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టారన్న హైకోర్టు.. అడ్మిషన్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో సౌకర్యాల పరిస్థితి ఎలా ఉందని ప్రభుత్వాన్ని అడిగింది. టెస్టుల రిపోర్టులు ఎంత సమయంలో అందిస్తున్నారో తెలపాలన్న కోర్టు..వ్యాక్సినేషన్ ఎలా జరుగుతుంది, ఎంత వ్యాక్సిన్ ఉంది, ఎంత మందికి వేశారు అవసరం ఎంత ఉందని ప్రభుత్వాన్ని ప్రశ్నించిoది న్యాయస్థానం. ఇక కేసు తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది హై కోర్టు.

Related posts