telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో ఏప్రిల్ 4నుంచి ఒంటిపూట బడులు..

ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4 నుంచి ఒక్కపూట బడులు నిర్వహించనున్నట్లుఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఉదయం 7.30 గం.ల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల తరగతులు కొనసాగుతాయని తెలిపారు.

రోజుకు రోజుకు ఎండతీవ్రత ఎక్కువుతుండ‌డంతో … విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. .ఈనెల ఏప్రిల్ 27 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. మే 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొ్న్నారు

మార్చి నెలలోనే భానుడి సెగలు ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమయ్యాయి. 43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం ఒంటి పూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది.

మరోవైపు తెలంగాణలో ఇప్పటికే ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. సాధారణంగా కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదువుతుండంతో మార్చి 16 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఒంటిపూట బడులను నిర్వహిస్తోంది.

 

Related posts