ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై తన ముందున్న వివిధ ప్రత్యామ్నాయాలపై ఎస్ఈసీ కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఆగిన చోట నుంచే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడం… కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం…. ఈ ఎన్నికల నిర్వహణను కొత్త ఎస్‌ఈసీకి వదిలేయడం. ఈ మూడు ఆప్షన్లను ఎస్‌ఈసీ పరిశీలిస్తున్నారు. కొత్త నోటిఫికేషన్ ఇస్తే.. న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయనే చర్చ జరుగుతుంది. ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామని గతంలో ప్రకటించడంతో కొత్త నోటిఫికేషన్ జారీకి ఇబ్బందులు ఉండచ్చు. కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఎస్‌ఈసీ గతంలో చేసిన ప్రకటనను చూపుతూ ప్రభుత్వం కోర్టుకెళ్లే ఛాన్స్ ఉంది. ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తే ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల విషయంలో పరిస్థితి గందరగోళంగామారింది. మళ్లీ ఇదే తరహా పరిస్థితి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ తలెత్తే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయంటూ స్వయంగా తప్పు పట్టారు ఎస్‌ఈసీ. నాటి ఎన్నికల నిర్వహణలో విఫలమ్యారంటూ కలెక్టర్లు, పోలీసు అధికారులపై చర్యలకు సిఫార్సు చేసారు.
previous post