telugu navyamedia
సినిమా వార్తలు

వైరల్ : “గెస్ ది వర్డ్” అంటూ చై-సామ్ ఫన్నీ గేమ్

majili movie first look

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సమంత పెళ్లి త‌ర్వాత జంట‌గా తొలిసారి స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న సినిమా “మజిలీ”. శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మాణంలో రూపొందిన “మ‌జిలీ” చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో స‌మంత‌తో పాటు దివ్యాన్ష కౌశిక్ మ‌రో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్రాలబృందం. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలకు ముందే చై-సామ్ జంట సందడి చేస్తోంది. తాజాగా “గెస్ ది వర్డ్” అనే ఓ ఫన్నీ ఆటతో ఆకట్టున్నారు చైసామ్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది.

ఇక ఈ చిత్రం నుంచి తాజాగా “నా గుండెల్లో…” అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటలో కొత్త హీరోయిన్ దివ్యాన్ష తన గ్లామర్ తో ఆకర్షిస్తోంది. నాగ చైతన్యతో రొమాంటిక్ గా కన్పించింది. మరి ఈ సినిమా తరువాత దివ్యాన్ష ఎలాంటి అవకాశాలను అందుకుంటుందో చూడాలి.

Related posts