telugu navyamedia
సినిమా వార్తలు

జీవిత చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌హిళా -గరుడవేగ నిర్మాతలు కోటేశ్వరరాజు, హేమ

*జీవిత చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌హిళా ..-హేమ
*జీవిత మాట‌ల‌కు పొంత‌న‌లేదు..-హేమ
*జీవిత‌ను నేను ఒక్క‌టే అడుగుతున్నా-హేమ
*నా ద‌గ్గ‌ర అప్పు తీసుకున్నావా లేదా?-హేమ
*డాక్యుమెంటుల‌ను నాద‌గ్గ‌ర అప్పుగా పెట్ట‌వా లేదా?-హేమ
*న‌న్ను సారీ చెప్ప‌వా లేదా? -హేమ
*సెల‌బ్రెటీ ముసుగును అడ్డుపెట్టుకుని జీవిత మోసం

సినీ న‌టి జీవిత రాజశేఖర్‌పై మ‌రోసారి గరుడవేగ నిర్మాతలు కోటేశ్వరరాజు, హేమ తీవ్రంగా మండిపడ్డారు . జీవిత చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌హిళా అని, సెల‌బ్రెటీ ముసుగును జీవిత అడ్డుపెట్టు కుని ప్రజలను మోసం చేస్తుంద‌ని అన్నారు.

మొదట్లో అసలు మేము ఎవరో కూడా తెలీదన్నారు. కానీ నిన్న మా గురించి లిమిట్స్‌ క్రాస్‌ చేసి మాట్లాడారు. మేము పరువుగల కుటుంబం నుంచి వచ్చాము. జీవిత రాజశేఖర్‌ నోరు అదుపులో పెట్టుకో. సెలబ్రిటీలకు ఒక లైఫ్‌, సామాన్యులకు ఒక లైఫ్‌ ఉంటుందా? సెలబ్రిటీ పేరుతో మోసాలు చేస్తోంది. జీవిత రాజశేఖర్‌ నోటికి వచ్చినట్లు మాట్లాడుతోంది.

మేము గరుడవేగ సినిమాకు సంబంధించిన డబ్బును ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆధారాలతో సహా అన్నీ మేము కోర్టులో సమర్పించాము. కోర్టులో మేము విజయం సాధిస్తాం’ అని కోటేశ్వరరాజు, హేమ పేర్కొన్నారు.

కాగా..అంత‌కుముందు జీవిత రాజశేఖర్‌ ఈ అంశంపై మాట్లాడుతూ గరుడవేగ సినిమా వివాదం కోర్టులో ఉందని, కోర్టులో తేలకముందే కొందరు ఏదేదో చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. అనవసరంగా తమ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించింది. తప్పొప్పులు తెలుసుకోకుండా అసత్యాన్ని ప్రచారం చేయవద్దని సూచించింది.

Related posts