telugu navyamedia
తెలంగాణ వార్తలు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు హైకోర్టుకు బదిలీ

*దిశా నిందితుల ఎన్‌కౌంట‌ర్ కేసులో కీల‌క నిర్ణ‌యం..
*కేసును హైకోర్టు బ‌దిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణ‌యం
*తదుప‌రి విచార‌ణ హైకోర్టులో జ‌రుగుతుంద‌న్న సుప్రీంకోర్టు
*క‌మిష‌న్ నివేద‌క‌ను సీల్డ్ క‌వ‌ర్‌లో ఉంచాల‌న్న ప్ర‌భుత్వ అభ్య‌ర్ధ‌ను సుప్రీంకోర్టు తిర‌స్క‌ర‌ణ‌..
*వాద, ప్ర‌తివాదుల‌కు నివేదిక అంద‌జేయాల‌ని ఆదేశం..
* డిసెంబ‌ర్ 6న దిశా నిందితులుఎన్‌కౌంట‌ర్‌..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై  సుప్రీంకోర్టు శుక్రవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో వాదనలు విన్న సుప్రీంకోర్టు కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. తదుపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని సుప్రీంకోర్టు వెల్ల‌డించింది.

Disha encounter case: Telangana govt to present evidence to Supreme Court-appointed panel today | Latest News India - Hindustan Times

ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో…హైకోర్టు నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  అయితే సిర్పూర్కర్ నివేదికను వాద, ప్రతివాదులకు అందించాలని సీజేఐ ధర్మాసనం పేర్కొంది.

క‌మిష‌న్ నివేదికను సీల్డ్ కవర్ ఉంచాలన్న ప్ర‌భుత్వ అభ్య‌ర్ధ‌ను సుప్రీం తిర‌స్క‌రించింది. విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ.రమణ దేశంలో దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు.

నివేదిక బయటపెడితే న్యాయవ్యవస్థపై ప్రభుత్వం చూపుతుందని న్యాయవాదులు వాదించారు. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను గోప్యంగా ఉంచాలని సీజేఐను సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ కోరారు. 

ఈ కేసులో దోషి ఎవరో తేలిపోయిందని .. ఇందులో గోప్యం ఏంలేదని, ఈ నివేదికను మరోసారి పరిశీలించే ప్రశ్నే లేదని కూడా సీజేఐ చెప్పారు

 

Related posts