telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రూట్‌ మార్చనున్న నందమూరి హీరో..

బాలయ్య బాబు సినిమా అంటే థియేటర్ల ముందు అభిమానులు బారులు తీరుతారు. అతడి సినిమా అంటే అంచనాలు తారాస్థాయిని దాటుతాయి. ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి దర్వకత్వంలో సినిమా చేయనున్నాడు. వీరి కాంబో ఇది మూడో సినిమా కావడం చాలా స్పెషల్‌గా ఉంది. వీరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు వీరి కాంబోలో రానున్న సినిమా కూడా అదే స్థాయిలో ఫిట్ అవుతుందని ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు బలరామయ్య బరిలోకి దిగితే అనే పేరును ఫిక్స్ చేశారు. ఇందులో కూడా బాలయ్య పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. అయితే తాజాగా వస్తున్నా సమాచారం ప్రకారం బాలయ్య తన స్టైల్ మార్చనున్నారట. ప్రస్తుతం ఈ సినిమా పిడుగురాళ్లలో షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈ సన్నివేశాల్లో కొత్త గెటప్‌తో కనిపించనున్నాడట. తాను చేసే యాక్షన్ సన్నివేశాల్లో కొత్త తరహా స్టైల్ చూపించాలని బాలకృష్ణ ఆలోచిస్తున్నాడట. ఈ విషయంపై బాలకృష్ణ ఫైట్ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌లతో కూడా మాట్లాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి వారు కూడా ఓకే చెప్పడంతో ఈ సినిమాలో బాలయ్య అభిరుచి తగ్గట్టుగా కొత్త తరహా యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యాజేస్వాల్ కనపించనుంది. అంతేకాకుండా ఇందులో ప్రముఖ నటుడు శ్రీకాంత్ కూడా నెగిటివ్ రోల్‌ చేయనున్నాడట. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సిఉంది. అయితే బాలయ్య అభిమానులు మాత్రం తమ అభిమాను హీరో సరికొత్త లుక్స్ కోసం, స్టైల్ కోసం ఎదురుచూస్తున్నారు.

Related posts