telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీముఖిపై “సైరా” టైటిల్ సాంగ్ రీమిక్స్… వీడియో వైరల్

Srimukhi

ఎన్నో అంచనాలతో జూలై 22న ప్రారంభమైన ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 3కు ఈ ఆదివారం (నవంబర్‌ 3న) శుభం కార్డు పడనుంది. అనేక మలుపులు, టాస్క్‌లతో వంద రోజులకు పైగా సాగుతున్న ‘బిగ్‌’ రియాల్టీ షో ఇది. 17 మంది సభ్యులు ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే గ‌త‌వారం శివ‌జ్యోతి ఎలిమినేట్ కాగా, ఈ వారం ఎలాంటి నామినేష‌న్ ప్ర‌క్రియ‌లు ఉండ‌వు. శ్రీముఖి, బాబా భాస్క‌ర్‌, అలీరెజా, రాహుల్‌, వ‌రుణ్ సందేశ్‌లు ఫైన‌ల్‌కు చేరుకున్నారు. వీళ్లలో ఒకరికి మాత్రమే రూ. 50 లక్షలు గెలుచుకొనే అవకాశం ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజేత ఎవ‌ర‌నే దానిపై ప్ర‌స్తుతం హాట్ హాట్ డిస్క‌ష‌న్స్ న‌డుస్తున్నాయి. అయితే గ్రాండ్ ఫినాలేకు రెండు రోజుల ముందు హౌస్‌మేట్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. పాత సభ్యులందరినీ ఇంట్లోకి పంపించారు. రవి, జాఫర్, అషు, రోహిణి, తమన్నా, పునర్నవి, వితిక, శివజ్యోతి, హిమజ, హేమ హౌస్‌లోకి వెళ్లి తమ మిత్రులను కలిశారు. కొంద‌రు హోర్డింగ్స్ ద్వారా ప్ర‌మోట్ చేస్తుంటే, మ‌రి కొంద‌రు త‌మకున్న టాలెంట్‌ని పూర్తిగా జోడించి సోష‌ల్ మీడియాలో వీడియోలు విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం హౌజ్‌లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్‌లో టైటిల్ రాహుల్‌కి లేదా శ్రీముఖి ద‌క్కుతుంద‌ని అంటున్నారు. శ్రీముఖిని విజేత‌గా నిలిపేందుకు చిరంజీవి న‌టించిన “సైరా” టైటిల్ సాంగ్ వాడుకున్నారు.టైటిల్ సాంగ్‌ని రీమిక్స్ చేసి బిగ్‌బాస్‌ 3 టైటిల్‌ గెలిచేది శ్రీముఖే అంటూ పవర్‌ఫుల్‌ లైన్‌లతో హోరెత్తించారు. ‘నిన్ను గెలిపించుకుంటాం’ అంటూ ఆమెకు నీరాజనం పలికారు. హౌజ్‌లో ఆమె జ‌ర్నీని షార్ట్ అండ్ స్వీట్‌గా వీడియోలో చూపించారు. లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సైరా స్టైల్‌లో శ్రీముఖి జ‌ర్నీ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Related posts