telugu navyamedia
సినిమా వార్తలు

‘బిగ్‌బాస్‌-5’ షురూ.. అదిరిన కంటెస్టెంట్స్‌ ఎంట్రీ

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. తారాజువ్వల వెలుగులో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్‌ నాగార్జున. బోర్‌డమ్‌ను కిల్‌ చేస్తూ స్టేజిమీదకు గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన నాగ్‌ మిస్టర్‌ మజ్ను పాటకు స్టెప్పులేశాడు. అనంతరం పంచ అక్షరాల సాక్షిగా, పంచేంద్రియాల సాక్షిగా, పంచ భూతాల సాక్షిగా.. నా పంచ ప్రాణాలు మీరే అంటూ అభిమానులను పలకరించాడు. అనంతరం బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లి ఇల్లంతా తిరుగుతూ సందడి చేశాడు. ఈసారి బిగ్ బాస్ హౌస్ గత సీజన్లలో ఎప్పుడూలేనంత రిచ్‌గా కనిపిస్తోంది. డైనింగ్ టేబుల్, హాల్, బెడ్ రూములు, స్విమ్మింగ్ పూల్… ఇలా ప్రతి అంశం కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఈసారి ప్రేక్షకులకు ఐదు రెట్లు ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తానంటున్నాడు. తరువాత వరుసగా కంటెస్టెంట్లను పరిచయం చేశాడు.

 స్టేజ్‌పై కంటెస్టెంట్స్ ఎంట్రీ

Bigg Boss 5 Telugu: Siri Hanmanth Entered As 1st Contestant In House - Sakshi
కంటెస్టెంట్ 1: యూట్యూబర్‌ సిరి హనుమంత్‌ ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ హౌస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో అవకాశం రావడం నా అదృష్టం అంది. ప్రేక్షకులు నానుంచి ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వడానికి సిద్ధం అంది. అలాగే స్టేజ్‌పై నాగ్‌తో తనకు కాబోయే మొగుడు గురించి చెప్పింది. సమంత డైలాగ్‌ ‘నాకు ఇష్టమైన రెండే రెండూ..’ అనే డైలాగ్‌ని నవరసాలు చేసి అదరగొట్టింది.

Bigg Boss 5 Telugu: VJ Sunny Entered As 2nd Contestant In House - Sakshi

కంటెస్టెంట్  2: సీరియల్ నటుడు సన్నీ తన డ్రీమ్‌ గర్ల్‌ గురించి చెప్పాడు. ఇక చక్కటి తెలుగింటి అమ్మాయి కావాలి అన్నాడు. నాగార్జున బోర్డు తెప్పించి ఆ అమ్మాయి కళ్లు ఎలా ఉండాలి గీయమన్నాడు. ఆ బొమ్మను చూసిని నాగ్‌ మామిడి కాయ మొఖం ఉన్న అమ్మాయి కావాలి అన్నాడు. ఇక ఇంటిలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే సన్నీ సిరితో పులిహోర కలపడం మొదలుపెట్టాడు.

Bigg Boss Telugu Season 5: Lahari Shari 3rd Contestant IEntered As 1st Contestant In House - Sakshi

కంటెస్టెంట్  3: లహరి హౌ యామ్‌ ఐ అంటూ.. ప్రోమోతో పరిచయమైంది. బ్లాంక్ మైండ్‌తో వచ్చాను. బయట ఎలా ఉంటానో లోపల కూడా అలానే ఉంటాను అంటూ ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మాయితో కూడా పులిహోర కలిపాడు సన్నీ. దానికి రాగానే మొదలు పెట్టేశావా అంటూ కౌంటర్‌ ఇచ్చింది లహరి.

Bigg Boss 5 Telugu: Sreerama Chandra Entered As 4th Contestant In House - Sakshi

కంటెస్టెంట్ 4: గాయకుడు ఇండియన్ ఐడల్ సీజన్ 5 విన్నర్ సింగర్‌ శ్రీరామ్‌ చంద్ర.. టీవీలో బిగ్‌బాస్ మ్యూజిక్ విన్నప్పుడు నన్ను పిలుస్తున్నట్లు అనిపించేదని అన్నాడు. ఇంతకాలానికి హౌస్‌లో అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నాడు. హౌస్‌ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానని అన్నాడు.

Bigg Boss 5 Telugu: Anee Master Entered As 5th Contestant In House - Sakshi

కంటెస్టెంట్  5: యానీ మాస్టర్‌ ప్రొమో ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈమె హైదరాబాద్‌లో పుట్టినట్లు తెలిపింది. ఇక హౌస్‌లో తన కొడుకును మిస్‌ అవుతాను అని తెలిపింది. స్టేజ్‌పై కూడా తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది యానీ మాస్టర్‌. ఇప్పటివరకు బిగ్‌బాస్‌ హౌస్‌లో అబ్బాయిలే గెలిచారు. ఈసారి తప్పకుండా అమ్మాయి గెలుస్తుంది అన్నారు.

Bigg Boss 5 Telugu: Lobo Entered As 6th Contestant In House - Sakshi

కంటెస్టెంట్  6 : లోబో ఎంట్రీ ఇచ్చాడు. దుకాణంలో పనిచేయడంతో జీవితం మొదలైందని, తన పేరు మహమ్మద్ ఖయ్యుం అని ఓ కజకిస్తాన్ అమ్మాయికి టాటూ వేస్తే ఆ అమ్మాయి లోబో అని పేరు పెట్టిందని అన్నాడు. తన భార్య రాకతో జీవితం మారిపోయిందని, అందరికంటే భిన్నంగా కనిపించాలని ప్రయత్నిస్తానని, చిన్నప్పటి నుంచి నాకు అలా ఉండటం ఇష్టమని అన్నాడు. బిగ్‌బాస్ హౌస్ తన కెరీర్‌కు మంచి వేదిక అవుతుందని అన్నాడు.

Bigg Boss 5 Telugu: Priya Entered As 7th Contestant In House - Sakshi

కంటెస్టెంట్  7 : నటి ప్రియ ఎంట్రీ ఇస్తూ బిగ్ బాస్ హౌస్ నాకు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదని అన్నారు. ఇన్నిరోజులు ఇండస్ట్రీలో ఉన్నానంటే దేవుడి దయ, తన అదృష్టమని చెప్పింది. వల్లే అది సాధ్యమైందని చెప్పారు. తన బలాలు, బలహీనతలు ఏంటో తెలుసుకునేందుకు ఈ షోకు వచ్చినట్లు చెప్పిన ప్రియ, జీవితంలో తాను ఒంటరిగా బతికాల్సి వస్తే ఎలా ఉంటుందో ఈ షో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తానని అన్నారు.

Bigg Boss 5 Telugu: Jessie Entered As 8th Contestant In House - Sakshi

కంటెస్టెంట్  8 : సూపర్‌ మోడల్‌, ట్రైనర్‌ జెస్సీ 36 గంటల పాటు ఏకధాటిగా మోడలింగ్‌ చేసి, రికార్డు సృష్టించిన జెస్సీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మోడలింగ్‌ ఎలా చేస్తారో చెప్పారు. బయటకు వచ్చే సరికి అందరికీ మోడలింగ్‌ నేర్పి.. వాక్‌ చేయిస్తావేమో అంటూ నాగార్జున సరదాగా వ్యాఖ్యానించగా, చిరునవ్వులు చిందిస్తూ జెస్సీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టారు.

Bigg Boss 5 Telugu: Priyanka Singh Entered As 9th Contestant In House - Sakshi

కంటెస్టెంట్  9 : ట్రాన్స్‌ జెండర్‌, నటి ప్రియాంక సింగ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాను ట్రాన్స్‌జెండర్‌గా మారడం వెనుక జరిగిన విషయాన్ని చెప్పింది. తనకు 25 ఏళ్లు వచ్చే సరికి ఇంట్లో పెళ్లి చేద్దామనుకున్నారని, వచ్చే అమ్మాయి జీవితం నాశనం అవకూడదనే ఉద్దేశంతోనే తన ఇష్టానికి అనుగుణంగా అమ్మాయిగా మారినట్లు వివరించారు. ఈ విషయం ఇప్పటివరకూ తన తండ్రికి కూడా తెలియదని, ఈ వేదిక నుంచే ఆ విషయాన్ని ఆయనకు చెబుతున్నానని అన్నారు. సహృదయంతో తన తండ్రి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తనని ఇంట్లో తేజ అని పిలుస్తారని, ఎప్పటికీ తన తండ్రికి అండగా ఉంటానని ప్రియాంక చెప్పుకొచ్చింది.

Bigg Boss 5 Telugu: Shanmukh Jaswanth Entered As 10th Contestant In House - Sakshi

కంటెస్టెంట్  10 : యూట్యూబర్ షణ్ముఖ్ కవర్‌సాంగ్స్‌తో తన కెరీర్‌ను మొదలు పెట్టినట్లు తెలిపాడు. నాగార్జునతో మాట్లాడుతూ వెబ్‌సిరీస్‌లు తనకు మంచి పేరు తెచ్చినట్లు చెప్పాడు. కొన్ని నెలల కిందట జరిగిన సంఘటన కారణంగా ఇప్పటికీ తాను పశ్చాత్తాప పడుతున్నానని అన్నాడు. ఈ షో కోసం ప్రత్యేకంగా ఏమీ సిద్ధం కాలేదని, సరికొత్తగా కెరీర్‌ను మొదలు పెట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు. షణ్ముఖ్ అంటే ఆరు ముఖాలు కలిగిన వాడు. మరి నీలో ఉన్న ఆ 6 రూపాలు హౌస్‌లో చూపిస్తావా.. అని నాగార్జున అడగ్గా, తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చాడు.

Bigg Boss 5 Telugu: Hamida Entered As 11th Contestant In House - Sakshi

కంటెస్టెంట్ 11 : సాహసం సేయరా ఢింభకా ఫేమ్‌ హీరోయిన్ హమీదా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మృదు స్వభావిని, సాయం చేసే తత్వం ఉందని అన్నారు.నీకు అబ్బాయిలు ఎలా ఉంటే ఇష్టం అని నాగార్జున అడగ్గా.. కళ్లు, స్మైల్‌, హెయిర్‌ స్టైల్‌ అంటే ఇష్టమని చెప్పగా, నాగార్జున ‘బిగ్‌బాస్‌’లోని ఐదుగురు కంటెస్టెంట్‌ల కళ్లు మాత్రమే చూపించి, ఈ కళ్లున్న వ్యక్తి బిగ్‌బాస్ హస్‌లో ఎవరో మీరు కనిపెట్టాలని అన్నారు.

Bigg Boss 5 Telugu: Nataraj Master Entered As 12th Contestant In House - Sakshi

కంటెస్టెంట్  12 : నటరాజ్‌ మాస్టర్‌.. హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి డ్యాన్స్‌ మాస్టర్‌ అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన ప్రేమకథను చెప్పాడు. తనకు అమ్మైనా, నాన్న అయినా తన భార్యేనని అన్నారు. తన భార్య 7 నెలల గర్భణి అని ఆమె ధైర్యం చెప్పడం వల్లే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్తున్నానని నటరాజ్‌ మాస్టర్‌ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన తన భార్యను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఏదో ఒకటి సాధించే హౌస్‌ నుంచి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Bigg Boss 5 Telugu: Sarayu Entered As 13th Contestant In House - Sakshi

కంటెస్టెంట్  13: సరయు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా నాగార్జున అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చి నవ్వులు పంచారు. బిగ్‌బాస్‌నే కాదు, ఎవరినైనా ధమ్‌ధమ్‌ చేస్తానంటూ చిరు నవ్వులు చిందించారు.

Bigg Boss 5 Telugu: Vishwa Entered As 14th Contestant In House - Sakshi

కంటెస్టెంట్ 14: విశ్వ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టాడు, నాగార్జున నిర్మించిన ‘యువ’ సీరియల్‌తోనే నటుడిగా పరిచయం అయినట్లు తెలిపారు. నాగచైతన్య కూడా కలిసి నటించడం, అఖిల్‌తో కలిసి క్రికెట్‌ ఆడటం ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఇండియాలో డబ్ల్యూడబ్ల్యూఈ ట్రైల్‌ అవుట్‌ జరిగితే అందులో ఫైనలిస్ట్‌గా ఎంపికైనట్లు తెలిపారు. విశ్వ కండలు చూసిన నాగార్జున ఒక చిన్న రిక్వెస్ట్‌ చేశారు. హౌస్‌లో టాస్క్‌లు ఆడేటప్పుడు కంటెస్టెంట్‌లను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. దీంతో విశ్వ చిరునవ్వులు చిందించాడు.

Bigg Boss 5 Telugu: Uma Devi Entered As 15th Contestant In House - Sakshi

కంటెస్టెంట్ 15: నటి ఉమ ఎంట్రీ ఇచ్చింది. తన వ్యక్తిగత, వృతి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని నటి ఉమ అన్నారు. సినిమాలతో పాటు, సీరియల్స్‌ ద్వారా మంచి పేరుతెచ్చుకుంది. ఉమాదేవి మనసులో ఏమనుకుంటుందో అదే మాట్లాడుతుందని, దాన్నే ‘బిగ్‌బాస్‌’ ద్వారా ప్రజలకు చూపించబోతున్నానని అన్నారు.

Bigg Boss 5 Telugu: Maanas Entered As 16th Contestant In House - Sakshi

కంటెస్టెంట్ 16: కాయ్‌ రాజా కాయ్‌’, ‘గ్యాంగ్‌ ఆఫ్ గబ్బర్‌సింగ్‌’ ‘గోలీసోడ’ చిత్రాలతో నటుడిగా ప్రేక్షకులకు సుపరిచితమైన మానస్‌ 16వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. చిన్నప్పటి నుంచి తన తల్లిని వదిలి ఎప్పుడూ లేనని, అయితే తనకు ఛాలెంజెస్‌ అంటే ఇష్టమని అందుకే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చినట్లు తెలిపాడు. హౌస్‌లో ఎప్పటికీ హీరోలా ఉండటానికే ప్రయత్నిస్తానని మానస్‌ అన్నాడు.

Bigg Boss 5 Telugu: RJ Kajal Entered As 17th Contestant In House - Sakshi

కంటెస్టెంట్ 17: ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి రావడం నమ్మలేకపోతున్నానని ఆర్జే కాజల్‌ అన్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె నాగార్జునను తొలిసారి ఇంటర్వ్యూ చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. హౌస్‌ నుంచి బయటకు వెళ్లేలోపు ప్రేక్షకులు, హౌస్‌మేట్స్‌తో పాటు నాగార్జునతో కూడా ‘ఐ లవ్‌ యూ’ చెప్పించుకోవాలన్నదే తన కోరిక అని అనగా, నాగార్జున అక్కడే ‘ఐ లవ్‌ యూ’ చెప్పి బాగా ఆడాలని వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా గాయని జానకిలా పాట పాడి కాజల్‌ అలరించారు.

Bigg Boss 5 Telugu: Sweta Varma Entered As 18th Contestant In House - Sakshi

కంటెస్టెంట్ 18: ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘ది రోజ్‌ విల్లా’ చిత్రాల్లో నటించిన శ్వేత వర్మ బిగ్‌బాస్‌-5లోకి 18వ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టారు. సీజన్‌-5ను చించి పడేస్తానని శ్వేత వర్మ ధీమా వ్యక్తం చేసింది. తనలో ఉన్న ఐదు రూపాలను హౌస్‌లో చూపిస్తానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

Bigg Boss 5 Telugu: Anchor Ravi Entered As 19th Contestant In House - Sakshi

కంటెస్టెంట్  19: యాంకర్‌, నటుడు రవి బిగ్‌బాస్‌-5లో అడుగు పెట్టాడు. ఇప్పటివరకూ తనని యాంకర్‌ రవిగా అంతా చూశారని, ఇక నుంచి రియల్‌ రవి కిరణ్‌ను చూడబోతున్నారని అన్నాడు. ఎంత రియల్‌గా ఉన్నా ఎవరూ నమ్మటం లేదని, ఈసారి ఆ నమ్మకాన్ని అందరిలోనూ కలిగిస్తానని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా రవి కుమార్తె మాటలను వినిపించి నాగార్జున సర్‌ప్రైజ్‌ చేశారు.

Related posts