telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

లాడ్జికి పిలిచిన ఫేస్‌బుక్ గర్ల్ ఫ్రెండ్..ఆ తర్వాత ఏమైదంటే..?

gril boy shado

సోషల్‌మీడియాలో ఈ మధ్య చాలామంది యువకులు ప్రొఫైల్ పిక్స్ చూసి మోసపోతున్నారు. కోల్‌కతాలోని ఓ యువకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. మోహిత్ అనే యువకుడు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించి అన్ని విషయాలు అందులో అప్‌డేట్ చేయడం, అపరిచితులతో ఛాటింగ్ చేయడం అతడికి అలవాటు. రెండు నెలల క్రితం ఓ అందమైన అమ్మాయా ఫ్రొఫైల్ పిక్ ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి అతడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఓ రోజు తనను కలిసేందుకు లాడ్జికి రావాలని ఆమె కోరడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

సూటు బూట్ వేసుకొని లాడ్జిలో ఆమె చెప్పిన రూమ్‌ దగ్గరికి వెళ్లి ఉత్సాహంగా తలుపు తెరిచాడు. తీరా అక్కడ సీన్ చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. నల్లగా భారీ ఆకారంతో ఉన్న నలుగురు వ్యక్తులను చూసి షాకయ్యాడు. వారి బారి నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆ నలుగురు మోహిత్‌ను బంధించి అతడి ఫోన్ నుంచే కుటుంబసభ్యులకు ఫోన్ చేసి భారీమొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో కంగారుపడిన మోహిత్ కుటుంబసభ్యులు వెంటనే కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోలీసులు వెంటనే అప్రమత్తమై ఫోన్ సిగ్నల్స్ ద్వారా లొకేషన్ కనుక్కుని కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు.

Related posts