telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

పచ్చి బఠాణీతో షుగర్, గుండె సమస్యలకు చెక్ !

పచ్చి బఠాణీలను మనం అనేక రకాల కూరల్లో వేస్తుంటాం. ప్రధానంగా కూర్మా, ఉప్మా, బిర్యానీ లాంటి వంటకాల్లో పచ్చి బఠానీలను వేస్తారు. అయితే.. వీటితో మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు అవేంటో చూద్దాం.

పచ్చి బఠాణీల వల్ల ప్రయోజనాలు

మలబద్దకంతో బాధపడేవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి కూరగా చేసుకుని తింటే విరేచనాలు సాఫీగా జరుగుతాయి.
వంద గ్రాముల బఠానీలు అరగడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఇతర కూరగాయలతో కలిపి తీసుకుంటే ఆకటి త్వరగా వేయదు. దీంతో బరువు కూడా పెరగదు.
వచ్చి బఠానీల్లో విటమిన్‌ ఎ, బీ1, బీ2 సీలతో పాటు ఐరన్‌, కాల్షియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా లభిస్తాయి.
వీటిలో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు మోతాదులో తీసుకుంటే క్యాన్సర్‌కు చెక్‌ పెట్టచ్చు.
యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి పచ్చి బఠాణీలు చక్కని ఆహారం. వీటిలో ఫైబర్‌ అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్‌ సమస్యకు చెక్‌ పెట్టవచ్చును.
గుండె జబ్బులు రాకుండా బఠాణీలు చూస్తాయి. రక్తనాళాలను సంరక్షిస్తాయి. విటమిన్‌ కె వీటిలో కావల్సినంత దొరుకుతుంది.
శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను కూడా ఇవి నాశనం చేస్తాయి. దీంతో అధిక బరువు తగ్గవచ్చు.

Related posts