telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వాట్సాప్‌ పై భార‌త్ సైబ‌ర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్…

whatsapp

వాట్సాప్‌లో లోపాల‌ను గుర్తించిన భార‌త్ సైబ‌ర్ సెక్యూరిటీ ఏజెన్సీ.. యూజ‌ర్లుకు ఓ వార్నింగ్ ఇచ్చింది.. వెంట‌నే ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల‌ని సైబ‌ర్ ఏజెన్సీ సీఈఆర్‌టీ కోరింది. ప్ర‌స్తుతం వాట్సాప్ యాప్‌లో కొన్ని లోపాల‌ను గుర్తించామ‌ని, వాటి వ‌ల్ల యూజ‌ర్ల స‌మాచారం లీక‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించిన సైబ‌ర్ ఏజెన్సీ.. ఆ లోపాల‌ను అధిగ‌మించ‌డానికి లేటెస్ట్ వ‌ర్ష‌న్ అప్‌డేట్ చేసుకోవాల‌ని సైబ‌ర్ సంస్థ సీఈఆర్‌టీ స్ప‌ష్టం చేసింది.. గూగుల్ ప్లే స్టోర్ లేదా ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి లేటెస్ట్ వ‌ర్ష‌న్ వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల‌ని స‌ల‌హా ఇచ్చింది.. కాగా, భార‌త ప్ర‌భుత్వ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ ఆధీనంలో ఇండియ‌న్ కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ప‌నిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంప్యూట‌ర్ సెక్యూర్టీ స‌మ‌స్య‌లు, లోపాల‌ను స‌రి చేసి.. దేశ‌వ్యాప్తంగా ప‌టిష్ట‌మైన ఐటీ సెక్యూర్టీ విధానాలు అమ‌లు చేయ‌డం కోసం ఇది ప‌నిచేస్తోంది.. మ‌రోవైపు, వాట్సాప్ ప్రైవ‌సీపై విమ‌ర్శ‌లు రావ‌డంతో.. ఆ సంస్థ కాస్త వెన‌క్కి త‌గ్గిన సంగ‌తి తెలిసిందే.

Related posts