telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మరో బాంబు పేల్చిన శ్రీలంక.. కొత్తరకం కరోనా.. గాలి ద్వారా వ్యాప్తి

చైనాలో పురుడుపోసుకున్న కరోన వైరస్ క్రమంగా అన్నీ దేశాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. తాజా కేసులతో దేశంలో 1.69 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 3,49,691 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 2767 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,17,113 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,66,60,172 కాగా.. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 26,82,751 గా ఉన్నాయి. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,92,311నమోదైంది.  ఈ తరుణంలో గాలి ద్వారా వ్యాపించే కొత్త రకం కరోనా వైరస్‌ను తమ దేశంలో గుర్తించినట్లు శ్రీలంక అధికారులు తెలిపారు. ఇక్కడ ఇప్పటికే కనుగొన్న రకాలతో పోలిస్తే చాలా ఉద్ధృతంగా ఇది విస్తరిస్తోందని పేర్కొన్నారు. ఇది గాల్లో దాదాపు గంటసేపు మనుగడ సాగించగలదని శ్రీ జయవర్ధనపుర విశ్వవిద్యాలయంలో ఇమ్యునాలజీ విభాగం అధిపతి నీలికా మలవిగే చెప్పారు. ఇటీవల దేశంలో ఎక్కువ యువత కొవిడ్‌-19 బారినపడుతోందని వివరించారు. దీనికి ఈ కొత్త రకమే కారణం కావొచ్చన్నారు. ఇది మూడో ఉద్ధృతికి దారితీయవచ్చని ప్రజారోగ్య నిపుణుడు ఉపుల్‌ రోహానా చెప్పారు.

Related posts