telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా ఎఫెక్ట్.. వృద్దులు బయటకు రావద్దు: కేంద్రం మార్గదర్శకాలు

karona virus

కరోనా వైరసు విర్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు బయటికి రావొద్దని సూచించింది. 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను కూడా బహిరంగ ప్రదేశాల్లో తిరగనివ్వరాదని పేర్కొంది. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా అంతర్జాతీయ, వాణిజ్య విమానాలకు అనుమతి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 22 నుంచి కనీసం వారం రోజుల పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఉండదని పేర్కొంది.

రైలు మార్గాలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్లిపోతున్నందున వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే విమాన సర్వీసుల నిలిపివేత తప్పదని కేంద్రం భావిస్తోంది. విమాన సర్వీసుల నిలిపివేత 22 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని, అప్పటివరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల ద్వారా భారత్ చేరుకునే ప్రతి ఒక్క ప్రయాణికుడిని క్వారంటైన్ శిబిరాలకు తరలించాలని కేంద్రం ఆదేశించింది.

Related posts