telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈ ఉపఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: పద్మావతి

padmavathi uttam congress

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ హుజూర్‌నగర్ ఓటు, నియంతృత్వ కేసీఆర్ పాలనకు ప్రశ్నగా మారుతుందనుకున్నామని వ్యాఖ్యానించారు. ఈ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నియంతృత్వ పాలన అంతం కావాలని అందరూ అనుకున్నారని చెప్పారు. యావత్‌ తెలంగాణ ప్రజల మనోభావాలను మోసుకుంటూ అభ్యర్థిగా తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని పేర్కొన్నారు.

తమ ఆకాంక్షను హుజురాబాద్ ఉప ఎన్నిక ద్వారా తెలియజెప్పాలని ప్రజలంతా కోరుకున్నారని చెప్పారు. వ్యక్తిగతంగా హుజుర్‌నగర్‌ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు పలికినా ఓడిపోవడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. మొదటి రౌండ్‌లోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 2 వేల ఆధిక్యం అనగానే తనకు అనుమానం వచ్చిందన్నారు. ఈవీఎంలలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

Related posts