telugu navyamedia
వార్తలు

పర్యావరణ పరిరక్షణకు జిహెచ్ఎంసి పరిధిలో 4,64,200 మట్టి వినాయక ప్రతిమల పంపిణీ – కమిషనర్ రోనాల్డ్ రోస్

వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం జిహెచ్ఎంసి పరిధిలో ఈ నెల 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు వార్డు వారీగా మట్టి గణేష్ విగ్రహాలు పంపిణీ చేయనున్నట్లు జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. వార్డుకు 2,500 చొప్పున ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి

సర్కిల్ కు ఒక ఏ.ఎం.ఓ.హెచ్ ను ఇన్ చార్జీగా, ప్రతి వార్డుకు వార్డు ఆఫీసర్ ను ఇన్ చార్జీగా నియమించామని కమిషనర్ తెలిపారు. ఈ నెల 14వ తేదీన కాప్రా సర్కిల్ భారతీయ విద్యా భవన్, సైనిక్ పురి, వాయుపురి లో హెచ్.ఎం.డి.ఏ ద్వారా పంపిణీ చేస్తారు. జిహెచ్ఎంసి ద్వారా 16, 17 తేదీల్లో కాప్రా సర్కిల్ ఏ.ఎస్.రావు నగర్, చర్లపల్లి, మీర్ పేట్ ఎస్.బి కాలనీ, మల్లాపూర్, నాచారం వార్డు కార్యాలయాల్లో హెచ్.ఎం.డి.ఏ, జిహెచ్ఎంసి సంయుక్తంగా 16800 వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తారు.

ఎల్బీనగర్ సర్కిల్ లో హస్తినాపురం, చంపాపేట్, లింగోజిగూడ ఈ నెల 16,17 తేదీల్లో 11,800 వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తారు.

మలక్ పేట్ సర్కిల్ లో సైదాబాద్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్ పేట్, అక్బర్ బాగ్, అజంపుర, చావని, డబీర్ పుర వార్డులలో 16,17 తేదీల్లో 17,500 మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తారు.

చాంద్రాయణగుట్ట సర్కిల్ లోని లలిత్ బాగ్, రియాసత్ నగర్, కంచన్ బాగ్, బార్కాస్, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, జంగం మెట్ వార్డులలో ఈ నెల 16,17 తేదీలలో మొత్తం 17,500 వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తారు.

చార్మినార్ సర్కిల్ లోని పత్తర్ గట్టి, మొగల్ పుర, శాలిబండ, ఘాన్సీ బజార్, పురనాపూల్ వార్డులలో ఈ నెల 16,17 తేదీల్లో మొత్తం 12,500 వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నారు.

గోషామహల్ సర్కిల్ లోని బేగంబజార్, గోషామహల్, మంగళహాట్, దత్తాత్రేయ నగర్, జాంబాగ్, గన్ ఫౌండ్రీ వార్డు కార్యాలయాల్లో ఈ నెల 16,17 తేదీల్లో మొత్తం 15000 మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నారు.

మొత్తం ఈ పంపిణీ ప్రక్రియలో జిహెచ్ఎంసి ద్వారా 1.5 ఫీట్ల మట్టి విగ్రహాలు 10వేలు, 1 ఫీట్ 30 వేలు, 8 ఇంచ్ ల విగ్రహాలు 2,70,000 విగ్రహాలు, అదే విధంగా హెచ్.ఎం.డి.ఏ ద్వారా 8 ఇంచ్ ల విగ్రహాలు 79,200, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా 8 ఇంచ్ ల విగ్రహాలు 75,000 విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. మరో 46 వేల మట్టి విగ్రహాలను జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ ద్వారా ఆయా ప్రదేశాల్లో పంపిణీ చేయనున్నారు. మొత్తం వార్డు ఆఫీస్ ల ద్వారా పంపిణీ చేసే మట్టి విగ్రహాలు జిహెచ్ఎంసి, హెచ్.ఎం.డి.ఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు కలుపుకుని మొత్తం 4,64,200 మట్టి విగ్రహాలను జిహెచ్ఎంసి పరిధిలో పంపిణీ చేస్తామని కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.

————————————————–

– సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.

Related posts