telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేంద్రం చర్యలతోనే కరోనాకు అడ్డుకట్ట: కన్నా

Kanna laxminarayana

కేంద్ర ప్రభుత్వ చర్యలతోనే కరోనా కేసుల సంఖ్యకు అడ్డుకట్ట పడిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… పేద ప్రజల కోసం ప్రధాని మోదీ రెండుసార్లు ప్యాకేజీలు ప్రకటించారని చెప్పారు. కేంద్రం ఇస్తోన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కరోనా కట్టడి కోసం అందరూ స్వీయ నియంత్రణ పాటించి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన సూచించారు.

కరోనా విజృంభణ నేపథ్యంలో నాలుగో దశ లాక్‌డౌన్‌ కూడా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా చేసిన ప్రసంగం ద్వారా అర్థమవుతుందనితెలిపారు. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆర్థిక ప్యాకేజీ దేశంలోని అన్ని రంగాలకు ఊతమిచ్చేదిగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీ వల్ల దేశంలోని అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతారని ఆయన అన్నారు.

Related posts