telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఉద్యోగులకు ఐఆర్‌ చెల్లింపునకు కేబినెట్ ఆమోదం

jagan

ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐదున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ చెల్లింపునకు కేబినెట్ ఆమోదంతో పాటు పలు పథకాల పై మంత్రివర్గంలో చర్చించారు. ఇదే సమయంలో పాలనలో పారదర్శకత కొరవడొద్దని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అవినీతికి పాల్పడితే సహించేది లేదని సీఎం జగన్ హెచ్చరికలు చేశారు. అవినీతి చేసినట్లు తెలిస్తే తక్షణమే పదవి నుంచి తొలగిస్తానని సీఎం స్పష్టం చేశారు.

కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు:

సామాజిక పెన్షన్లు రూ.2250కి పెంపు
ఆశా వర్కర్ల జీతాలు 3000 నుంచి 10,000కు పెంపు
ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన ఐఆర్‌ జులై నుంచి అమలు.
సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సీపీఎస్ రద్దు ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.
జనవరి 26 నుంచి ‘‘అమ్మ ఒడి’’ పథకాన్ని అమలు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ సుముఖత.
వైఎస్సార్‌ రైతు భరోసా అక్టోబర్ 15 నుంచి అమలు.
గిరిజన సంక్షేమశాఖలోని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు. రూ. 400 నుంచి 4000 వరకు వేతనాల పెంపు.
టీడీపీ హయాంలో ఉన్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలన్నీ రద్దు.
మున్సిపల్, పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.18వేలకు పెంపు.

Related posts