telugu navyamedia
రాజకీయ వార్తలు

డాక్ట‌ర్ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ఆర్డినెన్స్: కేంద్ర మంత్రి జ‌వ‌దేక‌ర్

praksh javadekar

కరోనా భారీన పడ్డ ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు హెల్త్‌వ‌ర్క‌ర్లు, డాక్ట‌ర్లు కృషి చేస్తున్నార‌ని కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ అన్నారు. అలాంటివారిపై దాడుల‌కు పాల్ప‌డ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. డాక్ట‌ర్ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ఆర్డినెన్స్ తీసుకువ‌చ్చిన‌ట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర‌ప‌తి ఆమోదం త‌ర్వాత ఆ ఆర్డినెన్స్‌ను అమ‌లు చేస్తామ‌న్నారు.

వైద్య సిబ్బంది పై దాడి చేస్తే ఇక నుంచి ఏడేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉన్న‌ది. హెల్త్ వ‌ర్క‌ర్ల‌పై దాడుల‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాన్ని తీసుకువ‌స్తున్న‌ది. 1897 ఎపిడ‌మిక్ డిసీజెస్ యాక్ట్‌కు స‌వ‌ర‌ణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురానున్న‌ట్లు మంత్రి తెలిపారు.

డాక్ట‌ర్ల‌పై దాడి చేస్తే ఇక నుంచి దాన్ని నేరంగా ప‌రిగ‌ణిస్తారు. కేవ‌లం 30 రోజుల్లోనే విచార‌ణ పూర్తి చేస్తారు. దోషిగా తేలిన వ్య‌క్తికి మూడు నెల‌ల నుంచి అయిదేళ్ల వ‌ర‌కు జైలుశిక్ష విధిస్తారు. నిందితుల‌కు 50వేల నుంచి 2 ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌రిమానా కూడా విధించ‌నున్నారు. ఒక‌వేళ చాలా తీవ్ర‌మైన దాడి జ‌రిగితే, దానికి మ‌రో విధ‌మైన శిక్ష‌ను అమ‌లు చేయ‌నున్నారని ఆయన తెలిపారు.

Related posts