telugu navyamedia
వార్తలు

రాందేవ్ రావ్ వైద్యుడికి అపూర్వ‌గౌర‌వం ఐఎస్‌సిసిఎం అధ్య‌క్షుడిగా డాక్ట‌ర్ శ్రీనివాస్ సామ‌వేదం ఎన్నిక‌

ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ (ఐఎస్‌సిసిఎం) నూత‌న అధ్య‌క్షుడిగా కూక‌ట్‌ప‌ల్లిలోని రాందేవ్ రావ్ ఆస్ప‌త్రిలో చీఫ్ ఇంటెన్సివ్ కేర్‌ స్పెషలిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీనివాస్ సామవేదం ఎన్నికైయ్యారు. సుమారు 14000 మంది డాక్ట‌ర్‌లు స‌భ్యులుగా ఉన్న ఐఎస్‌సిసిఎం ప్ర‌ధాన కార్యాల‌యం ముంబాయిలో ఉంది. ఈ సోసైటీ ద్వారా వైద్యులు, న‌ర్సులు, శాస‌కోశ నిపుణుల‌కు క్రిటిక‌ల్ కేర్ విభాగంలో శిక్ష‌ణ త‌ర‌గ‌తును అంద‌జేస్తారు. ఈ సోసైటీకి అధ్య‌క్షుడిగా 20 సంవ‌త్స‌రాల త‌రువాత ద‌క్ష‌ణ భార‌త‌దేశానికి చెందిన డాక్ట‌ర్ శ్రీనివాస్ సామవేదం ఎన్నిక‌య్యారు. ఈయ‌న క్రిటిక‌ల్ కేర్ విభాగంలో 23 సంవత్స‌రాల పైబ‌డి అనుభవం క‌లిగి ఉన్నారు. ఈయ‌న త‌న వైద్య వృత్తిలో మ‌న‌దేశంతో పాటు విదేశాల‌లో అత్యుత్త‌మ కేంద్రాల‌లో శిక్ష‌ణ పొందారు. న‌గ‌రంలోని రాందేవ్ రావ్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున‌న డాక్ట‌ర్ శ్రీనివాస్ సామ‌వేదం అత్యుత్త‌మ ప‌ద‌వి ల‌భించ‌డం ప‌ట్ల ఆస్ప‌త్రి సిబ్బంది హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Related posts