telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వైసీపీ ఆరోపణలకు … టీడీపీ కౌంటర్…

tdp bonda uma counter on ycp comments

ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే అంబటి రాంబాబుకు అర్థం తెలుసా అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వర్ రావు ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిదంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. కంపెనీ సమాచారాన్ని డైరెక్టర్లు లీక్ చేస్తే దానికే ఇన్ సైడర్ ట్రేడింగ్ వర్తిస్తుందన్నారు. ఇన్ సైడర్ చట్టం దేనికి వర్తిస్తుందో ముందు తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన వాటిని కూడా తమకు ఆపాదిస్తున్నారని వాపోయారు. 2013లోనే బాలకృష్ణ వియ్యంకుడికి భూములిచ్చారని తెలిపారు. ఇప్పటికే భరత్ వివరణ ఇచ్చారని తెలిపారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఏసురత్నం, బ్రహ్మయ్య, శ్రీదేవి రాజధానిలో భూములు కొనలేదా అని నిలదీశారు. వైసీపీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు.. చర్చకు సిద్ధమా అని అన్నారు. నకిలీ పత్రాలు తీసుకొచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని..మీడియా సమక్షంలో తేల్చుకుందాం రండి అంటూ సవాల్ విసిరారు. 4 వేల ఎకారల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వేల ఎకరాలు భూములు కొన్నారన్నారు..ఆధారాలు చూపండి అని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు దత్తపుత్రుడు అనే స్థాయి అంబటి రాంబాబుకు లేదన్నారు. మీరు జగన్ మోహన్ రెడ్డి పెంపుడు కుక్కలా…అని ఘాటుగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తే అర్హత మీకు ఉందా అని ప్రశ్నించారు. పవన్ పాలకొల్లు నాయుడు అని అభివర్ణించారు. మీకేమన్నా డౌట్ ఉంటే మీ డీఎన్ఏలు చెక్ చేసుకోండని అన్నారు. మూడు రాజధానులు ఎలా పెడతారు? ఇవేమైనా సిమెంట్ కంపెనీలా అని ఎద్దేవా చేశారు. రాజధాని అంటే వైసీపీ నేతల బ్రాంచ్ ఆఫీసులు కాదన్నారు. మూడు రాజధానులు పెడతామని ఒకరు… 30 రాజధానులని మరొకరు..అమరావతి స్మశానం..ఎడారి అంటూ ఇంకొకరు అంటున్నారని..రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మశానం, ఎడారి, 30 రాజధానులు చేయడానికే వైసీపీకి ప్రజలు అధికారం అప్పజెప్పారా అని ప్రశ్నించారు. మీ ఇష్టమొచ్చినట్లు చేస్తామనడం కరెక్టు కాదన్నారు. చంద్రబాబు పిలుపుతో రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు రైతులు ఇచ్చారని తెలిపారు.

Related posts