telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ప్రేమించిన అమ్మాయి పై కిరాతంగా దాడి చేసిన ప్రేమోన్మాది…

ప్రేమించిన అమ్మాయి పై కిరాతంగా దాడి చేసాడు ఓ ప్రేమోన్మాది. అయితే తనను ప్రేమించాలంటూ రెండేళ్ళుగా ఓ అమ్మాయి వెంటపడుతున్నాడు షారూఖ్ సల్మాన్. ఛాలెంజ్ హబీబ్ సెలూన్ లో పని చేస్తుంటాడు షారూఖ్. తరుచూ సెలూన్ కు యువతి వెళ్తుండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దీంతో యువతిని ప్రేమించాలంటూ వేధిస్తూ వస్తున్నాడు షారూఖ్. గతంలోనే తండ్రితో కలిసి షారూఖ్ పై షీటీమ్స్ కు ఫిర్యాదు చేసింది యువతి. అయిన వెంటపడుతూ వేధిస్తున్నాడు. మేలో యువతికి కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలనుకున్నారు. విషయం తెలిసి యువతిని అంతమొదించేందుకు ప్లాన్ చేసాడు షారూఖ్. తనకు దక్కని యువతి మరెవరికి దక్కకూడదని నిర్ణయించుకున్న షారూఖ్… రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆ యువతి నివసిస్తున్న అపార్ట్మెంట్ వద్దకు వచ్చాడు. మాట్లాడాలంటూ యువతిని పిలిచాడు. యువతి మాట్లాడుతుండగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసాడు. కడుపు, ఛాతిలో షారూఖ్ కత్తితో దాడి చేసాడు. అయితే యువతి అరుపులతో అలెర్ట్ అయిన పేరెంట్స్.. అడ్డుకునేందుకు యత్నించగా ఆమె తల్లి పైన కూడా దాడి చేసాడు. ఆ తర్వాత పారిపోయేందుకు యత్నించిన షారూఖ్ ను పట్టుకున్న స్థానికులు నార్సింగి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్న చేస్తున్నారు.

Related posts