telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అర్థరాత్రి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్‌..

టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌ బాబును ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అశోక్ బాబు ని అరెస్టు చేశారని టీడీపీ నేతలు విమర్శించారు.

వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసిన సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించినట్టు ఆరోపణలు వచ్చాయి.. దీంతో సీఐడీ అధికారులు నిన్న రాత్రి ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు.

అశోక్ బాబు డిగ్రీ విషయమై తప్పుడు సమాచారం ఇచ్చారని ఓ ఉద్యోగి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనిపై జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్న గీతామాధురి సీఐడీకి సమాచారం అందిస్తూ ఫిర్యాదు చేశారు. సెక్షన్ 477ఏ, 465, 420 కింద కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు అశోక్ బాబును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

కాగా ఎమ్మెల్సీ అరెస్టుపై టీడీపీ స్పందించింది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే అశోక్‌బాబును సీఐడీ అరెస్ట్‌ చేసిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై నిలదీస్తున్నందుకు ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టిందని, సర్వీస్ మేటర్స్‌లో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరెంద్ర కుమార్ ఎమ్మెల్సీ ఆశోక్ బాబు అరెస్టును ఖండించారు. ఏపీ ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రధాన అంశాలపై చర్చను దారి మల్లించేందుకే ఈ అరెస్టు నాటకమాడుతోందన్నారు. ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తిని అర్థ రాత్రి అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏమోచ్చిందని ఆయన ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ అశోక్ బాబు అక్రమ అరెస్ట్ ను ఖండించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఖండించారు. ఉద్యోగులలో ప్రభుత్వం పై వచ్చిన వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికే అశోక్ బాబు అరెస్ట్ జరిగిందన్నారు.

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా అశోక్ బాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. ఇది కోర్టులో నిలబడే కేసు కాదని, అక్కడే పోరాడి తేల్చుకుందామని టిడిపి అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు.

Related posts