telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

సారథుల ఆలోచనతోనే .. గెలుపు సాధ్యం …. : గంభీర్

gambhir fire on selection board on rayudu

రెండు జట్ల సారథులు డే-నైట్‌ టెస్టులో పేసర్లను ఉపయోగించుకొనేటప్పుడు వినూత్నంగా ఆలోచించాలని ఎంపీ గౌతమ్ గంభీర్‌ అన్నాడు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్‌ చేయిస్తే వారు మరింత సమర్థంగా రాణిస్తారని వెల్లడించాడు. ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా శుక్రవారం భారత్‌, బంగ్లాదేశ్ తొలి గులాబి బంతి టెస్టు ఆడుతున్న సంగతి తెలిసిందే.

ఫాస్ట్‌ బౌలర్లను సారథులు వినూత్నంగా వాడుకోవాలి. ఎరుపు బంతి క్రికెట్లో పేసర్లను ఉదయం వినియోగించుకుంటారు. డే-నైట్‌ మ్యాచులో వారిని మధ్యాహ్నం ఒంటి గంటకు కాకుండా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఉపయోగించుకుంటే సమర్థంగా రాణించగలరు. ఎస్‌జీ గులాబి బంతి ఎలా ప్రవర్తిస్తుందో చూడాలని ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే నేను కూకాబుర్ర గులాబితో ఆడాను. ఎస్‌జీతో ఆడలేదు. లైట్ల వెలుతురులో మణికట్టు స్పిన్నర్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. చేతిలోంచి బంతి బయటకు వస్తున్నప్పుడు గమనించకపోతే ఆడటం సవాల్‌గా ఉంటుంది. బ్లాక్‌థీమ్‌ ఉండి, కృత్రిమ వెలుతురుకు అలవాటు పడితే మణికట్టు స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని గంభీర్‌ అన్నాడు.

Related posts