సీనియర్ నటుడు జనార్ధన్‌రావు చెన్నైలో శుక్రవారం మార్చి 6 ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన గతకొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుంటూరు జిల్లా పొనిగళ్ల గ్రామంలో జన్మించిన జనార్ధన్ రావు వెయ్యికి పైగా తెలుగు చిత్రాలు, పలు సీరియల్స్‌లో నటించారు. చివరిగా జనతా గ్యారేజ్ సినిమాలో నటించారు. అమ్మోరు, పెదరాయుడు, మజ్ను, కొండవీటి సింహం, తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చారు. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్‌లో కూడా తన నటనతో ఆకట్టుకున్నారు జనార్థనరావు. సౌత్ ఇండియా ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యుడిగా పనిచేసిన ఆయన సేవలకు గాను జాయింట్ సెక్రటరీ అయ్యారు. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.
previous post
అరే లుచ్చా.. లఫంగి ఫెలోస్… వీధిలోకి వెళ్లి మొరగండి… నా ఫేస్ బుక్ స్ట్రీట్ కాదు… మాధవీలత ఫైర్