telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

యస్ బ్యాంకు వ్యవహారం.. రానా కపూర్ నివాసంలో ఈడీ సోదాలు

yes bank rana

ప్రైవేటు రంగ యస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో యస్ బ్యాంకు వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ డిపాజిట్లపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్న క్రమంలో ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్ నివాసంలో నిన్న రాత్రి ఈడీ సోదాలు నిర్వహించింది.

డీహెచ్ఎఫ్ఎల్‌కు యస్ బ్యాంకు ఇచ్చిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారడం వెనక కపూర్ పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో కార్పొరేట్ సంస్థకు ఇచ్చిన రుణాల్లోనూ కపూర్ పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. తీసుకున్న రుణాలకు ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి కొంత సొమ్ము కపూర్ భార్య ఖాతాల్లోకి చేరినట్టు అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నివాసంలో ఈడీ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది.

Related posts