టైటిల్ హాట్ ఫేవరెట్‌గా ఈ సీజన్‌ను ఆరంభించిన ఢిల్లీ కేపిటల్స్.. దానికి తగినట్టుగా ఆటతీరును కనపరుస్తోంది. ఫామ్ కోల్పోయిన కోల్‌కత నైట్ రైడర్స్‌తో గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గురవారం రాత్రి మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసింది. కోల్‌కత నిర్దేశించిన 157 పరుగుల టార్గెట్‌ను ఇంకా 21 బంతులు ఉండగానే ఛేదించింది. ఢిల్లీ కేపిటల్స్‌కు ఇది అయిదో విక్టరీ. అయితే ఈ మ్యాచ్ లో కేపిటల్స్ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్, కోల్‌కత నైట్ రైడర్స్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మధ్య చోటు చేసుకున్న ఓ సీన్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ కేపిటల్స్ జట్టు బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోల్‌కత నైట్ రైడర్స్ బౌలర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌ను షాట్ ఆడటానికి ప్రయత్నించిన శిఖర్ ధవన్ దాన్ని మిస్ అయ్యాడు. బంతి కాస్తా దినేష్ కార్తీక్ గ్లౌస్‌లో వాలింది. వెంటనే అతను బెయిల్స్‌ను ఎగురగొట్టాడు. అతను క్రీజ్ నుంచి కదలకపోవడం.. దినేష్ కార్తీక్‌ను అసహనానికి గురి చేసినట్టయింది. శిఖర్ ధవన్‌పై ఫైర్ అయ్యాడు. ఎడమ చేతిని గాల్లోకి విసురుతూ ఆవేశంగా ఏదో చెప్పాడు. దీనితో శిఖర్ ధవన్ మోకాళ్లపై కూలబడ్డాడు. వారిద్దరి మధ్య చోటు చేసుకున్న ఈ హైఓల్టేజ్ సీన్‌ను చూసిన ఫీల్డ్ అంపైర్ వారిని వారించడానికి పరుగెత్తుకుని రావడం కనిపించింది. ఆ వెంటనే దినేష్ కార్తీక్.. వికెట్ల వెనక్కి చేరడం.. వరుణ్ చక్రవర్తి నెక్స్ట్ బాల్‌ను ఎదుర్కొనడానికి గబ్బర్ సింగ్ బిజీ కావడంతో ఈ సీన్ అక్కడితె కట్ అయింది.
previous post
ఇన్నాళ్లు చట్టాల కళ్లు కప్పారు… ఇకపై అలాంటివి సాగవు: విజయసాయి రెడ్డి