telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

18 ఏళ్ళు పై బడినవారికి వ్యాక్సిన్ ఇవ్వలేమని చెప్పిన రాష్ట్రాలు ఇవే…!

Corona Virus Vaccine

మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవ్వుతున్నాయి. అయితే మే 1 నుండి 18 ఏళ్ళు నిండిన అందరికి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  అయితే, 45 ఏళ్ళు నిండిన అందరికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ ఇవ్వడం ఇంకా పూర్తి కాలేదు.  సెకండ్ డోస్ వ్యాక్సిన్ కోసం, ఫస్ట్ డోస్ కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు.  డిమాండ్ కు తగినన్ని వ్యాక్సిన్ లు లేకపోవడంతో రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి.  అరకొర వ్యాక్సిన్ సప్లై తో కేంద్రం విమర్శలు పాలైంది.  ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాలతో పాటుగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కూడా రేపటి నుంచి 18 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వలేమని, వ్యాక్సిన్ సరిపడా లేవని చెప్పేసింది.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా రేపటి నుంచి వ్యాక్సిన్ ను ఇవ్వలేమని చెప్పేశాయి. చూడాలి మరి ఇంకా ఏ ఏ రాష్టాలు ఈ లిస్ట్ లో చేరుతాయి అనేది.

Related posts