telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

పోలీస్ ఆఫీసర్ నిర్వాకం… పిల్లలపై పెప్పర్ స్ప్రే…

Peppar-Spray

డెస్ మోయిన్స్‌లో స్థానికంగా ఉండే ఓ స్టోర్‌కు 8, 9 ఏళ్ల వయసు గల ఇద్దరు అబ్బాయిలు కత్తులతో రావడం గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం వెంటనే పోలీసులు అక్కడి వచ్చారు. అయితే పోలీసులు రావడం గమనించిన ఆ ఇద్దరు పిల్లలు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దాంతో ఓ ఆఫీసర్ వారిని వెంబడించాడు. కానీ వారి వద్ద కత్తులు చూసిన ఆఫీసర్ తనకు ఏదైన హాని తలపెట్టొచ్చని వారిపై పెప్పర్ స్ప్రే కొట్టాడు. అనంతరం వారిద్దరిని అదుపులోకి తీసుకుని వారి కళ్లను మంచి నీటితో శుభ్రం చేసి ఆసుపత్రికి తరలించారు. పోలీస్ అధికారి రాడ్ సాంటిజో మాట్లాడుతూ ఆ ఇద్దరు పిల్లలు కత్తులతో స్టోర్‌కు వచ్చి కొన్ని కూల్ డ్రింక్స్ దొంగలించినట్లు చెప్పారు. వారు తమతో పాటు తెచ్చుకున్న కత్తులతో ఎవరినీ గాయపరచడం గాని.. బెదిరించడం గాని చేయలేదని పేర్కొన్నారు. ఇక కత్తుల విషయమై పిల్లలను విచారించగా తమ రక్షణ కోసం తెచ్చుకున్నట్లు చెప్పారని సాంటిజో తెలిపారు.

Related posts