అగ్రరాజ్యం అమెరికాలో మూడు లక్షల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1100 మంది మరణించడం అమెరికా ప్రస్తుతం ఎలాంటి దుస్థితిలో చిక్కుకుందో చెబుతోంది. అమెరికాలో కరోనా మహమ్మారి అత్యంత వేగంగా పాకిపోవడం పట్ల న్యూయార్క్ టైమ్స్ మీడియా సంస్థ ప్రత్యేక కథనంలో వివరించింది.
చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో అమెరికాలో ప్రయాణాలపై ఆంక్షలు లేవు. దాంతో చైనా నుంచి కొన్నివారాల వ్యవధిలోనే అనేక దేశాలకు చెందిన 4.30 లక్షల మంది అమెరికాలో అడుగుపెట్టారు. వీరు 1300 విమాన సర్వీసుల ద్వారా అమెరికాలోని అనేక నగరాలకు చేరుకున్నారు.
వారిలో వుహాన్ నుంచి వచ్చినవారు వేలల్లో ఉన్నారట. కరోనా వైరస్ కు జన్మస్థానం వుహాన్ నగరం అని తెలిసిందే. చైనా నుంచి వచ్చే ప్రయాణికులను తనిఖీ చేయడంలో అమెరికా అప్రమత్తత పాటించకపోవడం కూడా వైరస్ వ్యాప్తికి కారణమైందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఇదంతా జనవరి మాసంలో మొదటి రెండు వారాల్లోనే జరిగిందని, అప్పటివరకు చైనా నుంచి అమెరికా వచ్చే ఎలాంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించలేదని కథనంలో వివరించింది.
హుజూర్ నగర్ లో ఉత్తమ్ భార్యను పోటీకి ఎలా నిలుపుతారు?: కర్నె ప్రభాకర్