telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రజాస్వామ్యానికి ముప్పు జాతీయపార్టీలే: ఒవైసీ

asaduddin owisi

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం వంటిదనిఅన్నారు. జాతీయ పార్టీల కారణంగానే దేశానికి నష్టం వాటిల్లిందన్నారు.

జాతీయ పార్టీల వల్లే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలంటే అది ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమని ఒవైసీ ఉద్ఘాటించారు. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నా పార్లమెంటులో వాటికి పెద్దగా ప్రాముఖ్యత లేదన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.

Related posts